పొలంలో...అమ్మా...! నాన్న...!

- ఆది ఆంధ్ర తిప్పేస్వామి - 7780263877

నిన్నటి నాగటి చాలులో

చెమట బిందువై తళుక్కున మెరిసిన నాన్న

నేడు ఊరికి ఉత్తరాన

కన్నీటి దీపమై సమాధికి వెలుగు నింపాడు

చెమట చుక్కతో జతకట్టి

ఆరుగాలం కంటికి రెప్పల్లే కాపాడిన అమ్మ

కొడిగట్టిన కన్నీటి దీపానికి చమురయింది

అనంతవాయువుల్లో కలిసిపోయిన

వెలుగు దివ్వెలు అమ్మా..నాన్నలు..!

 

కలవని తీరాలకు కదిలివెళ్లిన

కావడి కుండలు

కంటి రూపాల్ని 'అనాధలు'గా

చేనుగట్టుపై

తుమ్మచెట్లకు ఆనవాలు అమ్మా..నాన్నలు..!