సాహిత్య ప్రస్థానం నవంబర్‌ 2019

సాహిత్య ప్రస్థానం నవంబర్‌ 2019

ఈ సంచికలో ...

కథలు

మానవత్వం - విజయ్‌

పాడె మహోత్సవం - డా|| వి.ఆర్‌. రాసాని

చంద్రన్న - డా|| పెరుక రాజు

రుసిగాడు - ఎండపల్లి భారతి

మానవత్వం

కథ

- విజయ్‌ - 9490122229

థాయ్‌ల్యాండ్‌ సరిహద్దు ప్రాంతం . మయన్మార్‌కు కూతవేటు దూరం. అదొక చిన్న పల్లె. టాంగ్‌ ఆ పల్లెలో ఒక వ్యవసాయకూలీ. టాంగ్‌ తమ్ముడు తమ్ముని భార్య ఆకస్మికంగా ప్రమాదంలో మరణించారు. తమ్ముని ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ళ చాంగ్‌ను చూసే బాధ్యత తనపై పడింది.

అనుభూతి స్రవంతిలో ఇస్మాయిల్‌

విశ్లేషణ

డా|| పాపినేని శివశంకర్‌ - 8500884400

తెలుగు సాహిత్య రంగంలో 1960 దశాబ్దిలో ప్రవేశించింది అనుభూతి వాదం. అప్పటికి అభ్యుదయ సాహిత్యం ఉద్యమ స్థాయిలో విస్తరించింది.

ఇప్పుడు నిర్వేదానికి తావు లేదు

నివాళి

ఇంటర్వ్యూ: తెలకపల్లి రవి

సాహిత్యం గురించి మాట్లాడుకోవడమంటే ముందు పత్రికలు తర్వాత పుస్తకాలు చర్చకు వస్తాయి. మీ ఉద్దేశంలో ఈ రంగాల మధ్య అంతస్సంబంధం ఎలా వుంటుంది?

సాహిత్యం, భాష, సంస్కృతి ఆరిస్టోక్రసీ నుంచి ఒక విధమైన డెమోక్రసీకి మారడంలో పత్రికలు పెద్ద పాత్ర నిర్వహించాయి.

పాడె మహోత్సవం

కథ

- డా|| వి.ఆర్‌.రాసాని - 9848443610

మార్చిమాసం ... ఎండాకాలం... ఆరంభం. తంబళ్ళపల్లెమండలం... మేకలవారి పల్లె... రాశింటి ముందర... నడి వీధిలో మల్లేశు కుక్కల ఆట...పాట...

ఒక కంచుతట్టలో.... సగం కొట్టేసిన కపాలం ఆకారంలో బొచ్చెం.... పల్లోళ్ళు వేసే బిచ్చం ఆ బొచ్చెంలో వేయించుకుని డమరుకం వాయిస్తూ పాట పాడుతున్న సహస్ర పూర్ణిమలను సందర్శించిన గురువు.. గొరవ బీరప్ప...

కొడవటిగంటి కుటుంబరావు 'అనుభవం'

విశ్లేషణ

-  డా|| యస్‌. జతిన్‌ కుమార్‌ - 9849806281

1930ల నుంచి 80ల వరకు యాభై ఏళ్ళ పాటు సాహిత్య సృష్టిలో తలమునకలైనవాడు కొడవటిగంటి కుటుంబరావు. కథ, కథానిక, నవల, వ్యాసం, గల్పికలవంటి ప్రక్రియలతో మన సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవాడు,

చంద్రన్న

కథ

- డా|| పెరుక రాజు -9443091384

పెయ్యంత పుండు పుండోలె వుంది. గుండెమీది బండవెట్టినట్టుంది. చేను పనికి రోజు కింద దిగడే! మీద దగడే! ఎండకు ఏం చేసేది! పనికి కైకిలి పెడ్తా మంటే పైసలేడున్నవి!

తొలి మలితరం - తెలుగు కథలు

విశ్లేషణ

- డా|| మాదిరాజు హనుమంతరాజు - 9441130264

ఒక పనిని  అలస్యంగానైనా మొదలుపెట్టాలి, కాని చెయ్యకుండా ఉండటం చాలా తప్పు. అట్లానే నేను ఎప్పుడో చదివిన ఒక కథాసంపుటిని గురించి నలుగురికి చెప్పాలని నా ఆత్రుత మరియు నా బాధ్యత.

చంద్రవర్షంలో తడిసిన ' ప్రకృతి '

విశ్లేషణ

 - నీలం వెంకటేశ్వర్లు - 9502411149

'ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో, పదము కదిపితే ఎన్నెన్ని లయలో 'అంటూ ఒక సినీగీత రచయిత ప్రకృతిలోని విషయాలను, లయలను ప్రేక్షకులకు అందించాడు.

రుసిగాడు

కథ

- ఎండపల్లి భారతి -9652802460

మూడు దినాల నుంచి జొరం కాసి ఆస్పత్రికి బొయ్యి వాళ్ళిచ్చిన మాత్రలు మింగి మింగి నోరు పిడసరాయి అయిపొయింది .

సాహిత్య శిఖరం జాషువా

నివేదిక
- గుండు నారాయణ - 9951540671
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదం, విశ్వనరుడు గుర్రం జాషువా 124వ జయంతి ఉత్సవాలు సెప్టెంబర్‌ 21 నుండి 28 వరకు విజయవాడలో జరిగాయి. ఎనిమిది రోజులు తొమ్మిది విభిన్న రూపాలతో జాషువా సాంస్క ృతిక వేదిక ఈ ఉత్సవాలను నిర్వహించింది.
తెలుగు పలుకులు పలికే కోకిలమ్మ కువ...కువ
అనుభవిస్తే అవుతుంది మహాకవి జాషువా...
అంటరాని అమ్మ కన్న అణిముత్యమా...
కుల రక్కసిని ఎదిరించిన కవి దిగ్గజమా...