- బి.గోవర్థన రావు
9441968930నాకిపుడు
వెన్నెల్ని దోసిట పట్టి
ముఖానికి అద్దుకోవాలని
వేకువను ముంగిటనాటి
ముచ్చట తీర్చుకోవాలనీ లేదు!
వీస్తున్న గాలిని నియంత్రించాలని
నీటిని గుప్పెట పెట్టి
సంబర పడాలనీ లేదు!
హాయిగా మసలే మాట లేనేలేదు!!
అసలు-
నేను పుడుతూనే పెద్ద ప్రశ్నయిపోతాను!?
నా కుటుంబమంతటా... నసలాంటి గుసగుసలే!!
అడుగడుగునా -
అత్యాచారాలు త్రవ్విన నేలలో కూరుకుపోతున్నాను
అణిచివేత వేదనలను - అవమానాలను దాటలేక దగ్ధమౌతున్నాను!
ఈ దుర్మార్గపు సంస్కృతినీ - ఈ నికృష్ణ భావ జాలాన్నీ
ఎవరు పెంచి పోషిస్తున్నారో
ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారో -
ఎవరైతే... ఏంటి!?
వాడొక తల్లి బిడ్డ!