ఎస్. సుమిత్రా దేవి
7207550867తూర్పున సూర్యుడు
కళ్ళు తెరుస్తుండగానే
వీధిలో
పన్నెండేళ్ళ బాలుడి స్వరం
అలారంలా మ్రోగింది
మేటవేసిన నిరాశకు
చర్నాకోలాతో కొట్టినట్టు
దిగులు చీకట్లో మెరుపు మెరిసినట్టు
అతని ముఖం నిండా
ఆత్మ విశ్వాసం వెలుగుతోంది
ఇంటినిండా ఆత్మబలం నిండి ఉంది
నిన్నటి దాకా చిత్తుకాగితాలేరుకున్న కుర్రాడు
ఒక్క అడుగు ముందుకు వేశాడు
ఇంటి బరువు మోయడానికి
సన్నద్ధమై
బడికి వెళ్ళే సమయంలోగా పార్ట్‌టైం పనిని ఎంచుకుని
రిపేరు చేసుకున్న పాతసైకిల్‌పై
సవారీ చేస్తూ
దిగులులేని చిన్నపిట్టలా
దుఃఖాన్ని పటా పంచలు చేసే
శాంతి దూతలా
ఎక్కుపెట్టిన బాణంలా
దూసుకుపోతూ....
పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం....
పకక్షులు ఎగిరాయి,
కొమ్మలు కదిలాయి,
గాలి వీచింది,
ప్రతి చోట చైతన్యం
పుంజుకుంది.