కలాల కసరత్తు

-అడపా రామకృష్ణ
9505269091


ప్రభాత వార్తా కథనానికి
ఉలిక్కిపడే ఉద్యమం
భవిష్యత్త్తుంతా ఉక్కిరి బిక్కిరి
కలాల కసరత్తుకు చింతా క్రాంతులై
కండలు కరిగి కరిగి
మెదడు మొద్దుబారిన వారంతా
రాళ్ళెత్తిన దుండగులయ్యారు
రాయి విసరడం చాలా తేలిక
అక్షరం పంజా విసిరితే ఏమవుతుంది
అక్షర సత్యాన్ని పెట్రోలు సీసాలు కాదుకదా
అణుబాంబు కూడా పాతర వేయలేదు
కలాలు కలకాలం నిలిచిపోతాయి
ఆ నీడనే ఉద్యమాలు ఎదుగుతాయి
అక్షరాన్ని నమ్ముకుంటే
ఆత్మబంధువులా ఆశ్రయమిస్తుంది