నానీలు

- తగుళ్ళ గోపాల్‌
9505056316

అల్లరి చేస్తున్నారని
పిల్లల్ని తిట్టా
నిశ్శబ్దం
నన్ను భయపెడుతుంది
ఊరి వాళ్ళకవి
పాత గోడలె
నాకు మాత్రం
ప్రాణనాడులు
పిల్లల్ని
చెరువు చెంతకు పిల్చింది
ఏమయ్యారో
ఇప్పటికీ తెలువదు
రాయి
ఎండకు ఎండి
వానకు తడిసినందుకే
అంతగట్టిదనం!
చలికి
అమ్మకొంగు కప్పుకున్నా
అదంతా
పేదరికం పుణ్యం
ప్రతి నాలుక మీద
నానుతుంది
నాని
వేమన పద్యంలా....