కుదుపు

డా|| తిరునగరి
9392465475

ఇంత ఆత్మీయతను పెంచాలనే
ఈ పద్యాలు రాస్తున్నాను
ఇంత మానవతను వెలిగించాలనే
ఈ గీతాలు పాడుతున్నాను
ఇంత ఐక్యతను పెంపొందించాలనే
ఈ సమాజాన్ని కలుపుతున్నాను
 ఇంత చైతన్యాన్ని తేవాలనే
ఈ జనావళిని కుదుపుతున్నాను
 ఇంత సంస్కారాన్ని పంచాలనే
ఈ ప్రబోధాలు చేస్తున్నాను
ఇంత కాంతిని ప్రసరించాలనే
ఈ దీపాలు వెలుగిస్తున్నాను
ఇంత సహృదయాన్ని అందించాలనే
ఇంత జాగృతిని తేవాలనే
ఈ ఉద్యమం కొన సాగిస్తున్నాను
ఇంత చైతన్యాన్ని తేవాలనే
ఈ జనావళిని కుదుపుతున్నాను
ఇంత ఆత్మీయతను పెంచాలనే
ఈ పద్యాలు రాస్తున్నాను