- బి. కళాగోపాల్
94416 31029
ఒళ్ళు విరుచుకున్న ఉదయాన్ని
వంగదీసి అంకెల ముళ్లలో బంధించి
లోలకానికి వేలాడదీసిన జీవితమతనిది
తన ముఖం మీద మరో ముఖాన్ని తగిలించుకున్న
పగటి వేషగానిలా, నిత్యం మరో జీవితంలోకి తొంగిచూస్తూ,
సరిహద్దు జవాన్‌లా, ఉదయాస్తమయాల నడుమ
విస్తరిస్తూనే ఉంటాడు
గాజు కళ్ళ కటకాల్లో అంకెలే తప్ప
అక్షరాలని ఒలకనివ్వని యాంత్రికతలో,
ఈదురుగాలికి రాలిన పూరేకుల్లా
చిందర వందర జ్ఞాపకాల్ని ఏరుకుంటూ
ఉక్కిరి బిక్కిరి బతుకులో ఒంటరి నావికుడు
కార్యాలయాల్లో మరమనిషిలా అవిశ్రాంత పోరాటం
దస్తావేజుల ఊబిలో తన ఊపిరి సంతకం చేస్తూ
కాలం చెక్కిళ్ళను నిమిరే సెలవుదినానికై
తన నిరీక్షణ చూపులను పరిచే నిత్యపరీక్షకుడు
బతుకు ముల్లెలోని అప్పుల కుప్పలను ఒడుపుగా
సమీకరణ చేస్తూ, జూదమాడుతున్న జమా ఖర్చుల
పట్టికను దుర్భిణిలో మదింపు చేసి మురుస్తూ.....
ఎడారిలో ఒయాసిస్సులా
ఏడాదిలో వచ్చే రెండు నజరానాలకై ఎదురు తెన్నులు
కాలెండరీ గడుల్లో చిక్కుకున్న
అతని భవితవ్యం ఒక ఆకుపచ్చ సిరాసర్పదృశ్యం
పెత్తనపు జవాబుదారీ వ్యవస్థలో నలుగుతున్న ఇరుసులా,
పాలన చక్రబంధంలో
బదిలీల బతుకు మజిలీని
వెతుక్కునే పొద్దు గుంకని సూరీడు
జీతం రాళ్ళతో
జీవితాన్ని తూకమేసుకుంటూ
ఇరుకు బతుకు నీడుస్తున్న
అతని సేవల పుస్తకపుటల్లో
మెరుస్తున్న లిఖిత స్వేద బిందువులు
ఒద్దికైన ఔన్నత్యానికి గీటురాళ్ళు
జివోల శ