శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం ఈ సంవత్సరం నాటకం/ నాటికా సంపుటికి ప్రధానం చేయడం జరుగుతుందని ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. కడచిన మూడు సంవత్సరాలలో అంటే జనవరి 2012 నుంచి డిసెంబర్ 2014 వరకు ముద్రితమైన నాటకం/ నాటికా సంపుటులు పురస్కారానికి పరిశీలింపబడతాయని ఇందుకోసం రచయితలుగానీ, ప్రచురణకర్తలు గానీ మూడేసి ప్రతులు పరిశీలనార్థం పంపవలసిందిగా కోరారు. ఒకే రచయితవి ఒకటి కంటే ఎక్కువ నాటకాలు/ నాటికా సంపుటులు ఎన్నయినా పంపవచ్చునని తెలిపారు. పురస్కారంగా రూ. 10,000/`నగదు, శాలువ, మెమొంటో ప్రదానం చేస్తామని, నాటకం / నాటికా సంపుటిలోగా పంపవలసిందిగా కోరారు. 15`2`2015న పురస్కార ప్రకటన జరగుతుందని, 26`2`2015న హైదరాబాద్‌లో జరిగే సభలో పురస్కారం ప్రధానం చేస్తామని తెలిపారు. నాటకం / నాటికా సంపుటులు పంపవలసిన చిరునామా: ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి, ఆంధ్రాచార్యులు, తెలుగు శాఖాధ్యక్షులు, బెంగుళూరు విశ్వవిద్యాలయం, జ్ఞానభారతి, బెంగుళూరు`560 056.శ్రీమతి కొలకలూరి భాగీరథీ పురస్కారం ఈ సంవత్సరం కవితా సంకలనానికి (వచన, గేయ, పద్య, కవితా సంకలనాలు) ప్రదానం చేయడం జరుగుతుందని ఆచార్య కొలకలూరి మధుజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. కడచిన మూడు సంవత్సరాలలో అంటే జనవరి 2012 నుంచి డిసెంబర్ 2014 వరకు ముద్రితమైన కవితా సంకలనం (ఒక్క రచయిత కవితలే) ఈ పురస్కారానికి పరిశీలింపబడతాయని, పురస్కారం రచయితకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని ఇందుకోసం రచయితలుగానీ, ప్రచురణకర్తలు గానీ మూడేసి ప్రతులు పరిశీలనార్థం పంపవలసిందిగా కోరారు. ఒకటి కంటే ఎక్కువ సంకలనాలైనా పంపవచ్చు. పురస్కారంగా రూ.10,000/` నగదు, శాలువ, మెమొంటో ప్రదానం చేస్తామని, కవితా సంకలనాలు 15`1`2015లోగా పంపగోరుతున్నాము. 15`2`2015న పురస్కార ప్రకటన జరుగుతుందని. 26`2`2015న హైదరాబాద్‌లో జరిగే సభలో పురస్కారం ప్రదానం చేస్తామని తెలిపారు. కవితా సంకలనాలు పంపవలసిన చిరునామా : ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఆంధ్రాచార్యులు, తెలుగుశాఖ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి` 517 502.