నిత్య సాహిత్య కృషీవలుడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అని ఎస్సీ, ఎస్టీ,సెల్ డి.ఎస్.పి కవి, రచయిత అయిన లోసారి సుధాకర్ అన్నారు. రాచపాళెంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా డిసెంబరు 21న కడపలో ఆయనను కలసి అభినంధించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ గత నాలుగు దశాబ్ధాలుగా రాచపాళెం తెలుగు భాషా, సాహిత్యానికి ముఖ్యంగా నవలలు, కథానికలపై సద్విమర్శలు చేసి తెలుగు సాహిత్య అభ్యున్నతికి, పురోగతికి ఎంతగానో తోడ్పాటు అందించారన్నారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ ఎస్.మస్తాన్‌వలి మాట్లాడుతూ రాచపాళెంకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు రావడం తెలుగు ప్రజలు ముఖ్యంగా రాయలసీమ సాహిత్య అభిమానులకు ఆనందదాయకమన్నారు. రాచపాళెంను కలసి అభినందించిన వారిలో లోసారి సుధాకర్, ఎస్.మస్తాన్‌వలి, కర్నూలు సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగారపు మోహన్, రఘులు ఉన్నారు.