ఎక్స్‌రే 2014 జాతీయస్థాయి అవార్డు కవి సుంకర గోపాలయ్య, కోట, నెల్లూరు జిల్లా, రచన ‘‘ఒక సూర్యుడు ` ఒక నెల వంక’’కి లభించిందని ఎక్స్‌రే అధ్యక్షులు కొల్లూరి ఒక ప్రకటనలో తెలిపారు. విజేతకు పదివేల నగదు, జ్ఞాపికతో సత్కరించడం జరుగుతుందని ప్రధాన అవార్డుతోపాటు మరో పది మందికి ఉత్తమ పురస్కారాలు కూడా అందజేయబడతాయని తెలిపారు. ఈ సంవత్సరం ఉత్తమ కవితా పురస్కారాలు మందరపు హైమావతి (విజయవాడ) ‘‘నీలిగోరింట’’, కటుకోరa్వల రమేష్ (ఇల్లందు) ‘‘ఎవరైనా లైక్ కొట్టండీ’’, గుర్రాల రమణయ్య (నెల్లూరు) ‘అక్షరం’ వెంకటేష్‌వలన్‌దాస్ (నర్సాపూర్, మెదక్) ‘‘లలిత కళాతోరణం’’, కోసూరి రవికుమార్ (దాచేపల్లి) ‘‘మట్టీ`పూలూ... మరణిస్తున్న చోట’’ కె.వి. నాగేశ్వరరావు (కోవూరు,) ‘‘సందిగ్ధ సమయం’’ ఈతకోట సుబ్బారావు (నెల్లూరు) ‘షరామామూలే’, మల్లెల నరసింహమూర్తి (అనంతపురం) ‘‘కవితో మాట్లాడటమంటే’’, జి.విజయలక్ష్మీ (హైదరాబాద్) ‘‘నడుస్తున్న గాయం’’, బి.వి.వెంకట్రావు (ఆకునూరు) ‘‘భూగ్రహణం’’ అందుకోనున్నారు. 2014 ఎక్స్‌రే అవార్డు నిమిత్తం పోటీకీ 356 కవితలు వచ్చాయని ప్రముఖ సాహితీ వేత్త నవలా కధా రచయిత అంపశయ్య నవీన్ (వరంగల్) న్యాయనిర్ణేతగా వ్యవహరించారని ఆ ప్రకటనలో తెలిపారు.