కలేకూరి ప్రసాద్‌ (యువక) స్మారక సాహితీ అవార్డు

‘యువక’ పేరుతో కవిత్వం, గేయం రాసిన ప్రఖ్యాత రచయిత, అనువాదకుడు కలేకూరి ప్రసాద్‌ స్మారక సాహిత్య పురస్కారం కొరకు వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్‌ మొగిలి దేవప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2009 సంవత్సరం నుండి డిసెంబర్‌ 2014లోపు ప్రచురించిన కవితా సంపుటులు ఈ పోటీకి పంపవలసిందిగా కోరారు. మూడు ప్రతులను మిరియం అంజిబాబు, ప్రచార కార్యదర్శి, బహుజన రచయితల వేదిక, డో.నెం. 35`2`3ఇ, కేశవస్వామి పేట, 3వ అడ్డరోడ్డు, ఒంగోలు` 523 001, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించవలసిందిగా కోరారు. చివరి తేది: మార్చి 30. ఇతర వివరాలకు 9848187416, 9030748819 ద్వారా సంప్రదించవచ్చును.