విజయనగరం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో గురజాడ స్వగృహంలో జనవరి 2న చాసో వర్థంతి సభ జరిగింది. వేదవల్లి గీతాలాపనతో మొదలైన సభలో నాగరాజు మాట్లాడుతూ నిరాడంబర జీవితాన్ని గడిపిన చాసో కథా నిపుణుడని అన్నారు. ఎవరిని హేళన చేయాలో, ఎవరిని గౌరవించాలో చాసో కథలు తెలుపుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎల్.ఆర్.స్వామిని అభినందిస్తూ రామతీర్థ మాట్లాడారు. దక్షిణ భారతీయ భాషల్లో ఎల్.ఆర్. స్వామి ఎంతో ఉన్నతమైన సాహిత్యాన్ని మనకు తెలుగులో అందించారన్నారు. స్వామి మాట్లాడుతూ భవిష్యత్ చిత్రపటాన్ని చాసో తన కథల్లో ఆవిష్కరించాడని అన్నారు. ఈ సభలో చాగంటి తులసి చాసో విశిష్టతను, స్వామి రచనల తీరును వివరించారు. పి.యస్.శ్రీనివాసరావు సభాధ్యక్షత వహించగా, చీకటి దివాకర్ ఆహ్వానం పలికారు. కృష్ణారావు వందన సమర్పణ చేయగా, జనకి గారి పాటతో సభ ముగిసింది.