అంపశయ్య నవీన్‌ గ్రంథాల ఆవిష్కరణ

             ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్‌లో డిసెంబర్‌ 24న ఆయన రచనల ఆవిష్కరణ, నవలా పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాగిళ్ళ రామశాస్త్రి అధ్యక్షత వహించారు. ‘యే వెల్గులకీ ప్రస్థానం’ నవలను కె.వి. రమణాచారి, ‘చెదిరిన స్వప్నాలు’ నవలను బి. పాపారావు, ‘స్నిగ్ధఛాయ’ నవలను చుక్కారామయ్య ఆవిష్కరించారు. నవలలను దర్భశయనం శ్రీనివాసాచార్య, గిరిజా మనోహరబాబు, కె.పి. అశోక్‌ కుమార్‌లు  పరిచయం చేసారు. అనంతరం డా॥ ధేనుకొండ శ్రీరామమూర్తికి నవలా పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. అంపశయ్య నవీన్‌ స్పందన ప్రసంగం చేశారు. చలనచిత్ర దర్శకుడు ప్రభాకర్‌ జైనీ అంపశయ్య నవలను సినిమాగా రూపొందించడం కోసం కొన్ని దృశ్యాల షూటింగ్‌ను ప్రారంభించారు. పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్‌ దంపతులు, రామా చంద్రమౌళి, వి.ఆర్‌. విద్యార్థి, నమిలికొండ బాలకిషన్‌ రావు, డా. విజయమోహన్‌రావు, డా. కోదండరామారావు, వి.ఎల్‌. నరసింహారావు, పొట్లపల్లి ధరణీశ్వరరావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, ఆచార్యు బన్న అయిలయ్య, ఆచార్య ఎం. రాజేశ్వర్‌, డా॥ విజయకుమార్‌, డా. జానకి, ఆచార్య జి. దామోదర్‌, కె. దామోదర్‌రావు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.