అనంతపురంలో సింగమనేని సాహితీ సమాలోచన

సాహితీస్రవంతి ఆధ్వర్యంలో సింగమనేని నారాయణ సాహిత్యంపై సదస్సును అనంతపురంలోని ఎన్‌జివో హోంలో జూన్‌ 26న జరిగింది. సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఓల్గా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగమనేని సాహిత్యం సమాజంపై ప్రేమతో వచ్చిందన్నారు.యువరచయితలకు ఆయన సాహిత్యం మార్గదర్శకత్వంగా ఉంటుందని అన్నారు. సాహితీస్రవంతి జిల్లా గౌరవ అధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో సింగమనేని నారాయణ రైతుల కోసం ఆత్మవిశ్వాస యాత్రను కవులు, రచయితలతో నడిపారని తెలిపారు.  సింగమనేని కథా సాహిత్య సదస్సుకు కథా రచయిత్రి డా|| ప్రగతి అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో సూర్యసాగర్‌ మాట్లాడుతూ సింగమనేని కథల్లో వైవిధ్యం, ఆర్ధ్రత, ఆవేదన, సంస్కార భావన ఉంటాయని అన్నారు. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ సింగమనేని సాహిత్య విమర్శ పాఠకుడికి విడమర్చి చెప్పినట్లు ఉంటుందన్నారు. చదువరికి రాయలసీమ పట్ల మంచి అవగాహన ఏర్పడుతుందని అన్నారు. ఈ సదస్సులో ప్రముఖ రచయితలు శశికళ, నిర్మలారాణి, దేవకి, కవులు శ్రీనివాసరెడ్డి, మల్లెల, మధురశ్రీ, సాహితీస్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి హిదయ్‌తుల్లా, దాదా ఖలందర్‌, సూర్యనారాయణ రెడ్డి, నాగేశ్వరాచారి, నరసిరెడ్డి, అప్పిరెడ్డి హిరినాథరెడ్డి, రోహిత్‌, అశ్వర్థరెడ్డి, ప్రసన్న, నాగేంద్ర, పెద్దన్న, సత్యనిర్దారణ్‌ తదితరులు పాల్గొన్నారు.