అనంతపురంలో సాహితీస్రవంతి ఆధ్వర్యంలో సాహిత్య గోష్టి

అనంతపురంలో ఆగస్టు 23న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాహితీస్రవంతి ఆధ్వర్యంలో సాహిత్య గోష్టి జరిగింది. ఈ సమావేశంలో జూపల్లి ప్రేమ్‌చంద్‌ రాసిన 'ఆవేద' కావ్యాన్ని పిళ్ళా కుమారస్వామి విశ్లేషించారు. మనువాదాన్ని కాలదన్నేందుకు, అణగారిన కులాలు ఐక్యతా రాగం పలకాలని 'ఆవేద' కావ్యం ఆకాంక్షించిందని అన్నారు. జూపల్లి ప్రేమ్‌చంద్‌ 'నిచ్చెనమెట్ల లోలకం' కావ్యంపై శంకరనారాయణ రాజు మాట్లాడారు. అనంతరం కవితల పోటీ జరిగింది. ఈ కార్యక్రమంలో రమణ, యాకూబ్‌ఖాన్‌, వై.సి.పి.వెంకటరెడ్డి, నరసింహులు, కృష్ణమూర్తి, రాజు, నగేష్‌, చెన్నక్రిష్ణ, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.