నానీలు

కవి: 
పాలపర్తి ధనరాజ్‌
సెల్ : 
9550593901

నీతి నిజాయితీ
కాలం చెల్లిన కాణీ
అవినీతి లంచం
కాకినాడ కాజా

 

పొరుగింటి
పుల్లకూర
అవతలి సేల్స్‌మాన్‌
చూపిస్తున్న చీరలు

 

విదేశాల్లో
ఎదురయ్యే
వింత ప్రశ్న
మీదెన్నో పెళ్లి!

 

పెళ్లా నాకా
నేనొప్పుకోను
సహజీవనమా
అయితే ఓకే!

 

మాటలవాదోడు
పెరిగింది
చేతల చేదోడు
తరిగింది

 

రోడ్ల రద్దీలో
ఆంబులెన్స్‌
కే లేదా
క్లియరెన్స్‌

 

అరేంజ్డ్‌ మ్యారేజీ
పాత చింతకాయ
లవ్‌ మ్యారేజీ
కొత్త ఆవకాయ

 

డ్రగ్గు పెగ్గు
పబ్బు క్లబ్బు
సెల్లో నెట్టు
టీనేజర్ల బ్రాడ్‌గేజీ

 

స్వంత ఫ్లాటు
యజమానైనా
అపార్ట్‌మెంటులో
అద్దెకున్న వాడి వెబ్బే!

 

స్వదేశీ సంస్కృతి
విదేశీ సంస్కృతి
రుబ్బితే
నేటి మన సంస్కృతి

 

ఇడ్లీ సాంబారు
పెసరట్టు ఉప్మా
చపాతీ కుర్మ
మనమూ సెల్లూ

 

బార్లలో
'బీర్‌'బలులు
రెస్టారెంట్లలో
'విస్కో'డిగామాలు!