అంపశయ్య నవీన్‌ - నవలా పురస్కారం

అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌ తరపున నవలా పురస్కారానికి 2014 - 2017  మధ్య రచించిన ఎక్కడా ప్రచురించబడని నవలలను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ తరపున డి. స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతికి పది వేల రూపాయలు, ద్వితీయ బహుమతికి ఐదువేల రూపాయలు నగదు పారితోషికం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంపశయ్య నవీన్‌ జన్మదినమైన డిసెంబర్‌ 24న ఈ బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 31వ తేదీలోపు డి. స్వప్న, కార్యదర్శి, అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్టు, 2-7-71, ఎక్సైజ్‌ కాలనీ, హనుమకొండ, వరంగల్‌ - 506 001 చిరునామాకు పంపించ వలసిందిగా కోరారు. ఇతర వివరాలకు 0870- 2456458 ద్వారా సంప్రదించవచ్చును.