2018 - శాంతి రజనీకాంత్ స్మారక కవితా పురస్కారం కోసం 2016 - 2017 మధ్య కాలంలో వెలువరించిన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు ప్రముఖ సాహిత్యవేత్త శాంతి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 30లోపుగా వచన కవితా సంపుటాలను వి. వెంకటేశులు, కథా రచయిత, డోర్ నెం. 3-328, ఎస్‌ఎస్‌ఎస్ సూపర్ మార్కెట్ దగ్గర, తపోవనం, అనంతపురం చిరునామాకు నాలుగు కాపీలను పంపవలసిందిగా కోరారు. ఎంపిక చేయబడిన కవితా సంపుటి రచయితకు డిసెంబర్‌లో జరిగే సభలో పదివేల రూపాయల నగదు మరియు పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 8074974547 ద్వారా సంప్రదించవచ్చును.