కడియాల రామమోహన్‌రాయ్‌కి అద్దేపల్లి పురస్కారం

  ప్రముఖ సాహిత్య విమర్శకులు కడియాల రామమోహన్‌రాయ్‌ కి 2018 సంవత్సరానికి గాను అద్దేపల్లి రామమోహనరావు కవిత్వ విమర్శ పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు అద్దేపల్లి ఉదయభాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్‌ 9వ తేది సాయంత్రం కాకినాడలో రోటరీక్లబ్‌లో ఈ పురస్కారాన్ని అందివ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 'ఆధునిక తెలుగు కవిత్వ విమర్శ ధోరణులు' అంశంపై కడియాల రామమోహన్‌రాయ్‌ ప్రసింగించనున్నట్లు తెలిపారు. ఈ సభలో గిడ్డి సుబ్బారావు, చెలికాని స్టాలిన్‌, అరసవిల్లి కృష్ణ, సుంకర గోపాలయ్య తదితరులు పాల్గొంటారని, ఇదే సభలో అద్దేపల్లి సాహిత్యంపై డా. వాసా భూపాల్‌ పరిశోధనా గ్రంథం ఆవిష్కరణ జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.