అనంతపురం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో కేరళ వరద బాధితులకు విరాళాల సేకరణ

  అనంతపురం సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేరళ వరద బాధితుల సహాయార్ధం జిల్లాలోని అన్ని సాహితీ సంఘాలు కలిసి అనంతపురం  పుర వీధుల్లో సోమవారం ఆగస్టు 20న సాయంత్రం  జోలె పట్టి భిక్షాటన చేయడం జరిగింది. అనంతపురం  జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ కు సేకరించిన 14,335 రూపాయల మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌, కేరళ రిలీఫ్‌ ఫండ్‌ పేరిట డి డి తీసి డి డి ని అందజేశారు. చిత్రంలో సాహితీ స్రవంతి జిల్లా ప్రధనకార్యదర్శి దాముగట్ల హిదయతుల్లా, ఉపాధ్యక్షులు క ష్ణవేణి, సభ్యులు యాడికి సూర్యనారాయణ రెడ్డి డి డి ను అందజేసిన వారిలో ఉన్నారు.