గమనిక

సాహిత్య ప్రస్థానం అక్టోబర్‌ సంచికలో 'అధికారం, ఆప్యాయతల మధ్య నలిగిన ఆమ్రపాలి' వ్యాసం 'దాసరి సుబ్రహ్మణ్యేశ్వర రావు' పేరుతో ప్రచురితమైంది.  ప్రొ|| దార్ల వెంకటేశ్వర రావు గారు తను రాసిన ఆ వ్యాసం  ప్రజాకళ వెబ్‌పత్రికలో సెప్టెంబర్‌ 2007న ప్రచురించిన విషయాన్ని తెలియజేస్తూ సాహిత్య ప్రస్థానంకు ఈమెయిల్‌ చేశారు. తన బ్లాగ్‌లో ఆ వ్యాసం ఉందని పేర్కొన్నారు. సాహిత్య ప్రస్థానం పరిశీలనలో ఆ విషయం నిర్దారణ అయింది. ఈ విషయం దాసరి సుబ్రహ్మణ్యేశ్వర రావు దృష్టికి తీసుకువెళ్ళి ఈ విధంగా చేయటం సరైనది కాదని తెలియజేయడం జరిగింది.  భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది.

- ఎడిటర్‌