కవితల పోటీ ఫలితాలు

'న్యూ విజన్‌ సాంఘిక సేవా సంస్థ' 'వ్యవసాయ సంక్షోభం - రైతు ఆత్మహత్యలు - నివారణ' అంశంపై నిర్వహించిన కవితల పోటీ ఫలితాలను డా|| డి. క్రాంతి కుమార్‌,  దాదినబోయి ఏడుకొండలు ఒక  సంయుక్త ప్రకటనలో తెలిపారు. విజేతలుగా డా|| పోరెడ్డి రంగయ్య -ఆలేరు, డా|| బీరం సుందరరావు -చీరాల, వడలి రాధాకృష్ణ-చీరాల, కోసూరి రవికుమార్‌ -దాచేపల్లి, యు.యల్‌.యన్‌. సింహ-నెల్లూరు లు నిలిచారని తెలిపారు. ప్రత్యేక బహుతులను కె.పి. డింపుల్‌-తిరుపతి, కొండూరు వెంకటేశ్వరరాజు -గూడూరులకు లభించాయి. 2019 జనవరిలో తిరుపతిలో జరిగే కార్యక్రమంలో వీటిని అందజేస్తామని, ఈ పోటీకి 165 కవితలు వచ్చాయని, న్యాయనిర్ణేతగా విశ్లేషకులు వై.హెచ్‌.కె. మోహన్‌రావు వ్యవహరించినట్లు తెలిపారు.