ప్రత్యామ్నాయ విధానాలతోనే సాంస్క తిక వికాసం

జాతి జీవన విధానమే సంస్క తి అని, సాంస్క తిక వికాసానికి ప్రత్యామ్నాయ విధానం అవసరమని పలువురు వక్తలు సూచించారు. గుర్రం జాషువా 123వ జయంతిని పురస్కరించుకుని జాషువా సాంస్క తిక వేదిక, ప్రజానాట్యమండలి, ఎంబి విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి, యుటిఎఫ్‌, జనవిజ్ఞాన వేదిక, అంబేద్కర్‌-పూలే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సాంస్క తిక విధానంపై సెప్టెంబర్‌ 28న సెమినార్‌ నిర్వహించారు. జాషువా చిత్ర పటానికి పూల మాలవేసి సంగమం కన్వీనర్‌ సి.ఉమామహే శ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.

సంస్క తి అనే జీవనదిలో మానవుడే కేంద్రబిందువని,  ఆచార, వ్యవహారాల పేరుతో కొన్ని శక్తులు సంస్క తిని విషతుల్యం చేస్తున్నాయని సాహితీస్రవంతి గౌరవ అధ్యక్షులు తెలకపల్లి రవి అన్నారు. సుప్రీంకోర్టు వ్యక్తి స్వేచ్ఛను పెంపొందించే తీర్పులు ప్రకటిస్తుంటే, రాజకీయ వ్యవస్థ మాత్రం స్వేచ్ఛను కుదిస్తోంది. కల్చరల్‌ మాఫియాను అడ్డుకోవాలి. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు పడుతున్నాయన్నారు.  వీటిని ఛేదించాల్సి అవసరం ఉందని, మిర్యాలగూడలో సంచలనం స ష్టించిన ప్రణరు హత్యపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రముఖ సినీ దర్శకులు సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు సినీ రంగానికి కల్చరల్‌ మేనిఫెస్టో అవసరం అన్నారు. ప్రజా జీవితాలకు దగ్గరగా ఉండే కథలను ఎంచు కోవాలని, దళిత, మైనార్టీ, స్త్రీవాద, ప్రాంతీయ ఉద్యమాలు సినిమాల్లో ప్రతిబింబించడం లేదన్నారు. నాస్తిక కేంద్రం వ్యవస్థాపకులు విజయం మాట్లాడుతూ నూతన విలువలు సమాజంలోకి రావాలంటే మత మౌఢ్యాన్ని తరిమికొట్టాలన్నారు. ఏపీ గ్రంథాలయ కార్య దర్శి రావి శారద మాట్లాడుతూ సాంస్క తిక వికాసానికి పుస్తక పఠనం అవసరమన్నారు.

ఈ సందర్భంగా ప్రజాశక్తి సంపాదకులు ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ విభజన గాయాలతో ఉన్న ఏపీకి నూతన సాంస్క తిక విధాన కావాలని, భూములు, నదులు, ఖనిజాలను స్వాధీనం చేసుకున్నట్లే ప్రజా కళాకారులను కూడా ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకుంటోందని విమర్శించారు. ప్రజా సంస్క తికి తావు లేకుండా పాలక సంస్క తి కొనసాగుతోందని, సంస్క తి ప్రజల హక్కు అని, అభ్యుదయ వాదులందరినీ కలుపుకుని పోరాడాలన్నారు.

మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజా జీవితానికి సంబంధించిన సమస్యలు సాంస్క తిక రంగంలో ప్రతిబింబించడం లేదన్నారు. కౌలు రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు రచనల రూపంలో వెలుగులోకి రావాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే కె సుబ్బరాజు మాట్లాడుతూ సమాజంలో విస్తరిస్తున్న విష సంస్క తికి వ్యతిరేకంగా కలిసి పోరాడాలన్నారు.

అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజల సంస్క తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. నాటక అకాడమీ ఉపాధ్యక్షులు కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ జాతిని జాగ తం చేసే నాటక రంగాన్ని కాపాడాలన్నారు. ముస్లిం మేధావుల వేదిక కన్వీనర్‌ ఉష ఎస్‌ డ్యానీ మాట్లాడుతూ పాలక పక్ష సాహిత్యం, ప్రజా సాహిత్యం వేర్వేరుగా ఉంటున్నాయన్నారు. ఎంబి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీక ష్ణ మాట్లాడుతూ ఎన్నికల విధానంలో కూడా ప్రక్షాళన చేయాలన్నారు. సాంస్క తిక రంగ విశ్లేషకులు మంతెన సీతారాం మాట్లాడుతూ మతం ఒక్కటే సంస్క తికి ప్రాతిపదిక కాదన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రమేష్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ పాలక వర్గాలు మానవ సంబంధాలను వ్యాపారమయం చేస్తున్నాయన్నారు. ప్రజాసాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు, తెలుగు భాషాభివ ద్ధి సంఘం అధ్యక్షులు సామల రమేష్‌ బాబు, రచయిత, దర్శకులు వైఎస్‌ క ష్ణేశ్వరరావు, ప్రజానాట్య మండలి కార్యదర్శి అనిల్‌ కుమార్‌, ఎస్‌ఎంఎస్‌ కన్వీనర్‌ కారుసాల శ్రీనివాసరావు, విరసం నాయకులు రివేరా, వ్యాయామ అధ్యాపకులు బండి గోవర్థనరావు, సాహితీ స్రవంతి అధ్యక్షులు వొరప్రసాద్‌, ఒ. శాంతిశ్రీ, చిత్రకారులు సునీల్‌ కుమార్‌, అరసం కార్యదర్శి కొండపల్లి మాధవరావు, వై సిద్ధయ్య, కె లక్ష్మయ్య, గాదె సుబ్బారెడ్డి, రామరాజు, బోస్‌ తదితరులు పాల్గొన్నారు.