మల్లెతీగ పురస్కారం కోసం కవితలకు ఆహ్వానం

మల్లెతీగ పురస్కారం 2018 కోసం కవితలను ఆహ్వానిస్తున్నట్లు మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. కవితలు సామాజికాంశాల్ని  వస్తువుగా కలిగి ఉండాలని, ఈ పోటీ కోసం ప్రత్యేకంగా రాసినవి మాత్రమే పంపవలసిందిగా కోరారు. వర్తమాన సమాజంలోని ఏ అంశాన్నైనా కవితా వస్తువుగా తీసుకోవచ్చని తెలిపారు. ప్రధాన పురస్కారం రూ.5000 లు, ఆత్మీయ పురస్కారంగా 5గురుకి రూ. 3000 లు చొప్పున నగదు బహుమతి అందివ్వనున్నట్లు తెలిపారు. డిసెంబరు 15వ తేదీలోపు తమ కవితలను కలిమిశ్రీ, మల్లెతీగ, డోర్‌ నెం. 41-20/3-24, మన్నవవారి వీధి, కృష్ణలంక, విజయవాడ - 520 013 చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు 9246415150 ద్వారా సంప్రదించవచ్చును.