రాచపాళెం సాహిత్యంపై సమాలోచన

అనంతపురం సాహితి స్రవంతి ఆధ్వర్యంలో నెలనెలా 'వర్తమాన సాహితీ తరంగాలు' పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నవంబర్‌ 11న రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సాహితీ సమాలోచన జరిగింది. అనంతపురంలోని రఘువీరా టవర్స్‌లోని ఆర్‌.ఎమ్‌. అకాడమీలో నిర్వహించిన ఈ సదస్సులో రాచపాళెం రాసిన 14 విమర్శ గ్రంథాలపై 14 మంది వక్తలు ప్రసంగించారు. అమళ్ళదిన్నె, వెంకటరమణ ప్రసాద్‌, పిల్లా విజయ్‌, బాలసుబ్రహ్మణ్యం, ఇ. రాఘవేంద్ర, కె. నాగేశ్వరాచారి, అనితమ్మ, ఎం. ప్రగతి, చెన్నా రామమూర్తి, ఎ.ఎ. నాగేంద్ర, తన్నీరు నాగేంద్ర, ప్రజ్ఞా సురేష్‌, సడ్లపల్లి చిదంబర రెడ్డి, గోవిందరాజులు, చం, శ్యాంసుందర్‌శాస్త్రి, నిర్మలారాణి, క్రిష్ణవేణి, ఎల్‌.ఆర్‌. వెంకటరమణ, అప్పిరెడ్డి హరినాథ రెడ్డి, ఒంటెద్దు రామలింగారెడ్డి, దాదా ఖలందర్‌, రాంప్రసాద్‌, ఆశావాది ప్రకాశరావు, మల్లెల నరసింహమూర్తి, నర్సిరెడ్డి, దాదా ఖలందర్‌, యాడికి సూర్యనారాయణ రెడ్డి, సత్య నిర్దారణ్‌ తదితరులు పాల్గొన్నారు.