శశిశ్రీ స్మారక సాహిత్య పురస్కారం 2019

శశిశ్రీ స్మారక సాహిత్య పురస్కారం 2018 కోసం ఆధునిక సాహిత్య అనువాద గ్రంధాలను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్‌ షేక్‌ మస్తాన్‌వలి ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కార కమిటీ తరపున కేతు విశ్వనాథ రెడ్డి, షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఈ అంశాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. సంవత్సరానికి ఒకో అంశాన్ని ప్రకటిస్తున్నామని తెలిపారు. 2016 జనవరి నుండి 2018 డిశంబర్‌ 31 మధ్య కాలంలో ప్రచురితమైన అనువాద గ్రంథాల్ని ఈ పురస్కారం కోసం పంపించవలసిందిగా కోరారు. గ్రంథం కనీసం 100 పేజీలు ఉండాలని, 4 కాపీలను షేక్‌ మస్తాన్‌వలి, జర్నలిస్టు, 38-712, పి.ఎస్‌. నగర్‌, సెంట్రల్‌ ప్రిజన్‌ పోస్టు, కడప - 2 చిరునామాకు పంపించవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు 9494111310 ద్వారా సంప్రదించవచ్చును.