శిఖామణి, ఇబ్రహీం నిర్గుణ్‌లకు 2018-విమలాశాంతి సాహిత్య పురస్కారాలు

విమలాశాంతి సాహిత్య పురస్కారం 2018 గాను 'చూపుడు వేలు పాడే పాట' కవితా సంపుటికి గాను శిఖామణికి, 'ఇప్పుడేదీ రహస్యం కాదు' కవితా సంపుటికి గాను 'ఇబ్రహీం నిర్గుణ్‌' కి ప్రకటించినట్లు శాంతినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 'శాంతి రజనీకాంత్‌ స్మారక కవితా పురస్కారాలు' పేరుతో వీటిని 2019 జనవరిలో జరిగే పురస్కార ప్రదానోత్సవ సభలో అందివ్వనున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.7500ల నగదు, పురస్కార జ్ఞాపిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పురస్కార ఎంపికకు ప్రముఖ రచయితలు అమ్మంగి వేణుగోపాల్‌, కొప్పరి వెంకటరమణమూర్తి, తూముచెర్ల రాజారాం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినట్లు తెలిపారు. ఈ పురస్కారానికి యువ కవులతో పాటు ప్రముఖ కవులు  తమ సంపుటాలను పంపారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.