వేంపలె షరీఫ్‌కు చాసో పురస్కారం

గుంటూరు జిల్లా వేంపల్లెకు చెందిన షేక్‌ మహహ్మద్‌ షరీఫ్‌కు 2018 సంవత్సరానికి గాను చాసో పురస్కారానికి ఎంపికచేసినట్లు చాసో స్ఫూర్తి సాహితీట్రస్టు అధ్యక్షులు, ప్రముఖ కథా రచయిత చాగంటి తులసి విజయనగరంలో జరిగిన ఒక ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ప్రముఖ కథా రచయిత చాగంటి సోమయాజులు (చాసో) 104వ జయంతి పురస్కరించుకుని జనవరి 17న  విజయనగరంలోని చాసో సాహితీవేదిక వద్ద ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని  తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన వేంపల్లె షరీఫ్‌ 'జుమ్మా', 'టోపి జబ్బార్‌' కథా సంపుటాలు వెలువరించారని, సమకాలీన తెలుగు కథా సాహిత్యంలో మంచి కథకుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో

చీకటి దివాకర్‌, జి.ఎస్‌. చలం పాల్గొన్నారు.