జనరంజక కవి పురస్కార ఫలితాలు

''జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు'' కోసం రావి రంగారావు సాహిత్య పీఠం ప్రకటనకు స్పందించి కవులు 186 కవిత్వ  గ్రంథాలు పంపించారని రావి రంగారావు సాహిత్య పీఠం కన్వీనర్‌ నర్రా ప్రభావతి ఒక ప్రకటనలో తెలిపారు. అందులో నాలుగు గ్రంథాలను ''జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు'' కోసం ఎంపిక చేయటం జరిగిందని వివరాలు తెలియజేశారు. 1. ''మట్టి రంగు బొమ్మలు''(వచన కవితలు)- సిరికి స్వామినాయుడు (పార్వతీపురం, విజయనగరం జిల్లా), 2. ''నల్ల చామంతి'' (వచన కవితలు) -చిత్తలూరి సత్యనారాయణ (అడ్డ గూడూరు, యాదగిరి భువనగిరి జిల్లా), 3. ''సవ్వడి'' (గజళ్ళు) - శ్రీమతి భైరి ఇందిర (ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), 4. ''మా ఇంటి దేవతలు'' (బాల గేయాలు) - బెలగాం భీమేశ్వరరావు (పార్వతీపురం, విజయనగరం జిల్లా).   గుంటూరు బ ందావన్‌ గార్డెన్స్‌ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదిక మీద ఫిబ్రవరి 11 సోమవారం సాయంత్రం 6 గం.కు జరిగే సభలో ఈ పుస్తకాలు రాసిన కవులకు ఒక్కొక్కరికి 2000 రూ. నగదుతో, శాలువాతో, జ్ఞాపికతో పురస్కార ప్రదానం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.