ఆధునిక సాహిత్యం, రాజకీయాలపై ప్రపంచీకరణ ప్రభావం పెద్ద స్థాయిలో ఉందని ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని స్వరాజ్యమైదాన్‌లో 30వ పుస్తక మహోత్సవ్‌లో సాహిత్యం - ప్రపంచీకరణ ప్రభావం అనే అంశంపై సమాలోచన కార్యక్రమం జనవరి 9న జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ సంస్క తి అంటే క్రికెట్, సినిమా, క్రిమినలైజేషన్, సెలబ్రిటీ, కార్పొరేట్ సెక్టార్ మాత్రమే కాదన్నారు. సామాన్యులకు కూడా అన్ని అవకాశాలు అందే విధంగా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచీకరణ ప్రభావం వల్ల మనిషి తనని తాను అమ్ముకుంటూ ఒక వస్తువును కొనుగోలు చేసే స్థితిలో నేడు ఉన్నారన్నారు. ప్రపంచీకరణ ప్రభావం సాహిత్యంతో పాటు అన్ని రంగాలపై కూడా పడిందన్నారు. మతాన్ని కూడా రాజకీయ వస్తువుగా, మార్కెటింగ్ సాధనంగా మార్చివేశారన్నారు. ఇటీవల తెలుగులో వచ్చిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఒకరిద్దరి గురించి మాత్రమే చూపించారని, ప్రజాకోణంలో ప్రశ్నించేతత్వాన్ని చూపించలేకపోయారని అన్నారు. సీనియర్ పాత్రికేయులు డాక్టర్ ఘంటా విజయకుమార్ మాట్లాడుతూ అక్షరం జాగ తి చేసేలా లేదని, సాహిత్యం, అక్షరం రెండూ అమ్ముడుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పు చేసి దర్జా చేయడం అనే సంస్క తి నేడు వచ్చిందని, దీని నుండి మారాలన్నారు. కవి బంగార్రాజు కంఠ మాట్లాడుతూ ప్రజలను జాగ తి చేసే రచనలు తక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి క ష్ణ అధ్యక్షత వహించగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, ప్రముఖ రచయిత పి.చంద్రశేఖర్ ఆజాద్, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ, రచయిత శ్రీరామకవచం సాగర్ తదితరులు పాల్గొన్నారు.