'బ్లాక్‌ వాయిస్‌' ఆవిష్కరణ సభ

సామాజిక పరివర్తన కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఫిబ్రవరి 3న తంగిరాల సోని కవితా సంపుటి 'బ్లాక్‌ వాయిస్‌' ఆవిష్కరణ సభ జరిగింది. ఆవిష్కర్త డా|| చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ కుల సమాజంలో పెత్తందారులు దళితులపై సాగించే రకరకాల హింస, పీడన, వివక్ష వంటి అంశాలను తంగిరాల సోనీ తీవ్రస్వరంతో కవిత్వం చేశారన్నారు. సభాధ్యక్షత వహించిన బివిఎస్‌ సత్యనారాయణ మాట్లాడుతూ సోని తన కవితా సంపుటిలో బడుగు బలహీన వర్గాలపై దాడులకు వ్యతిరేకంగా కవితలు రాశారన్నారు. రచయిత తంగిరాల సోని స్పందిస్తూ తన అనుభవంంలోకి వచ్చిన సామాజిక అంశాలను కవితా వస్తువులుగా స్వీకరించానని అన్నారు. సీనియర్‌ పాత్రికేయులు ఘంటా విజయకుమార్‌, బెందాళం కృష్ణారావు, పింగళి చైతన్య, కరీముల్లా, దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌, సామాజిక పరివర్తన కేంద్రం ప్రధాన కార్యదర్శి వున్నవ వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.