విజయనగరంలో పుస్తకావిష్కరణలు

విజయనగరంలో ఫిబ్రవరి 21న సాహితీస్రవంతి ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవం సభ జరిగింది. ఈ సందర్భంగా సిరికి స్వామినాయుడు కవితా సంపుటి 'మట్టి రంగు బొమ్మలు', బొల్లోజు బాబా రాసిన 'కవిత్వ భాష' పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. 'కవిత్వ భాష' పుస్తకాన్ని  ప్రముఖ కవి, కథకులు గంటేడ గౌరునాయుడు, 'మట్టి రంగు బొమ్మలు' పుస్తకాన్ని దేవరాజు గోపాలకృష్ణ ఆవిష్కరించారు. మానాపురం రాజాచంద్రశేఖర్‌, మొయిద శ్రీనివాసరావు 'కవిత్వ భాష' పుస్తకంపై ప్రసంగించారు. మట్టిరంగు బొమ్మలు పుస్తకంపై అద్దేపల్లి ప్రభు ప్రసంగించారు. ప్రముఖ కవి పాయల మురళీకృష్ణ సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌, జిల్లా అధ్యక్షులు పి.ఎస్‌. శ్రీనివాసరావు, ఎస్‌విఆర్‌ కృష్ణారావు, రెడ్డి శంకరరావు, చంద్రికారాణి, హైమవతి, చెళ్ళపిళ్ళ శ్యామల తదితరులు పాల్గొన్నారు.