'జీవన స్వరం' ఆవిష్కరణ సభ

కాకినాడ సాహితీస్రవంతి ఆధ్వర్యంలో ఇంద్రగంటి నరసింహమూర్తి కథల సంపుటి 'జీవన స్వరం' ఆవిష్కరణ సభ గాంధీభవన్‌లో ఫిబ్రవరి 17న జరిగింది. సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షులు జోశ్యుల కృష్ణబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కవి, రచయిత మార్ని జానకిరామ్‌ చౌదరి పుస్తకాన్ని ఆవిష్కరించారు. బొల్లోజు బాబా, సుంకర గోపాలయ్య పుస్తకాన్ని సమీక్షించారు. ఈ సభలో సాహితీస్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు గనారా, రచయిత ఇంద్రగంటి నరసింహమూర్తి, పద్మజావాణి, అద్దేపల్లి జ్యోతి, ఇందిర, ఎజ్రాశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.