అరుణ్‌సాగర్‌ సంస్మరణ సభ

రుణ్‌సాగర్‌ సంస్మరణ సభ (3వ వర్థంతి) విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సాగర్‌ సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న జరిగింది.  సభాధ్యక్షత వహించిన ప్రముఖ కవి ఖాదర్‌ మొహియుద్దీన్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాల వ్యథలను సమాజం ద ష్టికి తెచ్చేందుకు కవి, పాత్రికేయులు అరుణ్‌సాగర్‌ చేసిన  సాహిత్య కృషి సమాజంలో కవులందరూ అందిపుచ్చుకోవడమే ఆయనకిచ్చే అసలైన నివాళి అన్నారు. పాత్రికేయురాలు వడ్లమూడి పద్మ మాట్లాడుతూ పాత్రికేయుడుగా, స్నేహితుడుగా, కవిగా అరుణసాగర్‌ వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతనూ వివరించారు. ప్రముఖ విమర్శకులు కవి, జి.లక్ష్మినరసయ్యకు అరుణ్‌ సాగర్‌ జీవన సాఫల్య సాహిత్య పురస్కారం అందజేశారు.  ప్రముఖ అడ్వకేట్‌ సంపర శ్రీనివాసుకు సాగర్‌ మిత్ర అవార్డును ప్రదానం చేశారు. జి. లక్ష్మీనరసయ్య సాహిత్య కృషిపై కవి, విమర్శకులు కోెయి కోటేశ్వరావు వివరణాత్మక ప్రసంగం చేశారు. ఈ సభలో ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు, అరుణ్‌సాగర్‌ సహచరి ప్రసన్న, సోధరుడు జగన్‌, ఇతర కుటుంబ సభ్యులు,   న్యూట్రిషనిస్టు డాక్టర్‌ జానకి, టివి 5 జర్నలిస్టు జె.రాంబాబు, పలువురు కవులు, రచయితలు అరుణ్‌సాగర్‌ మిత్రులు పాల్గొన్నారు.