అనంతపురంలో మహిళా దినోత్సవ కవి సమ్మేళనం

ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తిని తదుపరి తరాలకు అందజేయాల్సిన మహత్తర బాధ్యత సాహిత్య కారులదే అని ప్రముఖ కవి, కవిత్వ విమర్శకులు తూముచర్ల రాజారాం పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న సాహితీ స్రవంతి అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లలిత కళాపరిషత్తులో జరిగిన కవి సమ్మేళనం లో పాల్గొని ప్రసంగించారు. సాహితీ స్రవంతి జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోత్స్న అధ్యక్షతన జరిగిన సభలో లలిత కళాపరిషత్తు కార్యదర్శి, న్యాయవాది పద్మజ మహిళల కోసం సాధించుకున్న చట్టాల గురించి వివరించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి మాట్లాడుతూ ఎందరో మహిళల త్యాగాల కారణంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనాన్ని సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షురాలు ప్రగతి సమన్వయం చేశారు. గాయత్రి రామోజీ, యాడికి సూర్య నారాయణ రెడ్డి, ఉద్దండం చంద్రశేఖర్‌, యమున, రామచంద్రరావు, హేమమాలిని, దాదా ఖలందర్‌, మధురశ్రీ, విద్యావతి, లక్ష్మి, కుంచె లక్ష్మి నారాయణ, చిలుకూరి దీవెన, ప్రగతి, క ష్ణవేణి తదితరులు మహిళా ఇతివ త్తం పై కవిత్వం వినిపించారు. కవితలను ప్రముఖ కవి రాజారాం సమీక్షిస్తూ కవులను అభినందించారు. సాహితీ స్రవంతి జిల్లా ఉపాధ్యక్షురాలు యమునా రాణి ఆహ్వానం పలకగా, కమిటీ సభ్యులు హేమమాలిని వందనసమర్పణ చేశారు. చెన్నా రామ్మూర్తి, రియాజుద్దీన్‌, నాగేశ్వరాచారి, అక్షరమాలి సురేష్‌ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.