పలమనేరు బాలాజీ కి మాడభూషి రంగాచార్య కథా పురస్కారం

థా రచయిత పలమనేరు బాలాజీకి 'ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు' కథా సంపుటికి గాను మాడభూషి రంగాచార్య కథా పురస్కారం లభించింది. మార్చి 23 న హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో ఈ పురస్కారాన్ని మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం కమిటీ నిర్వాహకురాలు శ్రీమతి లలితా దేవి, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ నాళేశ్వరం శంకరం, ప్రముఖ సాహితీవేత్తలు నగ్నముని ,ఏ కె ప్రభాకర్‌ , బి.వి.ఎన్‌.స్వామి అందజేశారు. పలమనేరు బాలాజీ కథా సంపుటి 'ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు' ని ప్రముఖ సాహితీవేత్త  ఏకే ప్రభాకర్‌ సభకు పరిచయం చేశారు.