ఉమ్మడిశెట్టి సత్యాదేవి 31వ సాహిత్య పురస్కారానికి 2018 సంవత్సరానికి గాను పుప్పాల శ్రీరాం కవితా సంపుటి 'అద్వంద్వం' ఎంపికయినట్లు అవార్డు వ్యవస్థాపకులు డా|| ఉమ్మడిశెట్టి రాధేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కవులు ఆశారాజు, జి. వెంకటకృష్ణ, అద్దేపల్లి ప్రభు ఈ అవార్డు ఎంపికకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్‌లో అనంతపురంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. పుప్పాల శ్రీరాం తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఆంధ్రాబ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే వెలువరించిన 'అద్వంద్వం' ఆయన తొలి కవితా సంపుటి.