ఓటు విలువపై కవితా బులెటిన్‌

విశాఖపట్నం సాహితీస్రవంతి, వైజాగ్‌ ఫెస్ట్‌ సంయుక్తంగా ఓటు విలువపై ప్రచురించిన కవితా బులెటిన్‌ను ఏప్రిల్‌ 6న జి.వి.ఎం.సి. ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైజాగ్‌ ఫెస్ట్‌ కార్యదర్శి ఎ.అజశర్మ మాటాల్డఉతూ రాజకీయాలు కులం, మతం, ప్రాంతం, డబ్బు వంటి అంశాలతో ప్రభావితం అయి కలుషితమౌతున్నాయని అన్నారు. ఈ అంశాలపై కవులు తమ కవితలతో సమాజాన్ని జాగృతం చేయాలని పిలుపిచ్చారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని, అందుకు కవులు, రచయితలు, మేధావులు తమ గొంతు బలంగా వినిపించాలని కోరారు. కవులు నూనెల శ్రీనివాసరావు, శివకోటి నాగరాజు, యల్లాప్రగడ రమాదేవి, కుమార్‌ ఆర్తి, సందీప్‌ రుద్రబక్షుల, సుజాతామూర్తి, సాహితీస్రవంతి విశాఖ అధ్యక్షలు ఎ.వి. రమణారావు, పెంటకోట రామారావు తదితరులు పాల్గొన్నారు.