కడపలో సిపిబ్రౌన్ పరిశోధనా కేంద్రంలో ఏప్రిల్ 1న శశిశ్రీ స్మారక సాహిత్య పురస్కారం ప్రదాన సభ జరిగింది. 2019 సంవత్సరానికి గాను అనువాద సాహిత్యంలో కృషిచేస్తున్న రంగనాథ రామచంద్రరావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కేతు విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ తెలుగు, కన్నడ సాహిత్యాలకు వారధి రంగనాథ రామచంద్రరావు అన్నారు. ఈ సభలో టి. సంజీవమ్మ, షేక్ హుస్సేన్ సత్యాగ్ని, మూల మల్లికార్జున రెడ్డి, జి.వి. సాయిప్రసాద్, షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.