గుడివాడలో కందుకూరి శతవర్దంతి సభ

సామాజిక సమస్యలే ఇతివృత్తంగా వీరేశలింగం చేసిన రచనలు ఆనాటి యువతకు స్ఫూరినిచ్చాయని గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి డా|| కొడాలి సోమసుందర్‌ అన్నారు. స్థానిక సుందరయ్య భవన్‌లో సాహితీస్రవంతి గుడివాడ కన్వీనర్‌ సురేంద్ర అధ్యక్షతన కందుకూరి జయంతి సభలో ఆయన ప్రసంగించారు. తాను నమ్మిన ఆశయాలకై పోరాడటమే గాక ఆచరించి చూపిన ధీశాలి అని కొనియాడారు. తెలుగు పండితులు వి. వీరరాఘవాచార్యులు, డి. ఆనందమోహన బోసు, నవ్వుల పొదరిల్లు నిర్వాహకులు యం.యస్‌.వి. సత్యనారాయణబాబు తదితరులు ప్రసంగిస్తూ నేటి యువకులు, రచయితలు కందుకూరిని ఆదర్శంగా తీసుకుని అణచివేతకు వ్యతిరేకంగా రచనలు చేసి ప్రజలను చైతన్యపరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.