నేటి సమాజానికి కందుకూరి సాహిత్యం అవసరం

విశాఖ నగరంలోని మద్దిలపాలెం కళాభారతిలో సాహిత్య, కళా, సాంస్క తిక, ప్రజా సంస్థల ఆధ్వర్యంలోకందుకూరి శత వర్ధంతి సమ్మేళనం జూన్‌ 5న జరిగింది. సంఘంలోని దురాచారాలను ఎదిరించడం.. వాటిని సరిచేయడంలో ఒకే ఒక్కడు 'కందుకూరి' వీరేశలింగం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ప్రపంచానికి తెలియాల్సి ఉంది. నాడు ఆయన వేసిన ముందడుగు సమాజంలోని తిరోగమన భావాలను వెనక్కి నెట్టే మార్గాలను నేటికీ చూపుతోంది. కానీ కొందరు ఆయన సజించిన చైతన్యాన్ని బతకనివ్వకుండా, వికసింపజేయకుండా వెనక్కి నెట్టాలని నేడు చూస్తున్నాయి. వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి' అని ప్రముఖ కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్‌, మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి ఎడిటర్‌ ఎంవిఎస్‌.శర్మ పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్‌ అధ్యక్షత వహించిన సభకు కొలకలూరి ఇనాక్‌ కీలకోపన్యాసం చేశారు. సాంఘిక దురాచారాలపై కందుకూరిలా పోరాడిన వారూ సాహిత్యరంగంలో ఇంతవరకూ లేరన్నారు. తెలుగు ప్రజలు నేటికీ ఆయన్ను స్మరించడానికి కారణం 'ఆయన రాయని విషయమంటూ' ఏదీ లేదన్నారు. మూఢ నమ్మకాలపై పోరాడి, వితంతు వివాహాలను ప్రోత్సహించడానికి పెద్ద యుద్ధమే చేశారన్నారు. అయితే ఆయన కాలం కంటే క్లిష్టమైన పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయన్నారు. మతం పేర జరిగే దౌర్జన్యాలపైనా, సమాజంలోని దుస్సాంప్రదాయలను మూలాలతో సహా పెకిలించడానికి ఆచరణలో క షి చేస్తూనే పత్రికల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన ధైర్యశాలి అని కొనియాడారు. కందుకూరి లేకపోతే 'ఆధునిక గద్య రచన' స ష్టి ఉండేది కాదన్నారు. సమాజానికి అనుసంధానంగా ఆయన స జించిన సాహిత్యాన్ని అధ్యయనం చేయకపోతే నేటి, భావితరం చాలా నష్టపోతుందని అన్నారు. ఆచరణలో చేసి బహుముఖ కోణాలను దర్శించి మార్గం చూపించిన ధీశాలి కందుకూరి అని ప్రజాశక్తి ఎడిటర్‌ ఎంవిఎస్‌.శర్మ వెల్లడించారు. నేడు మాద్యమాల్లో ప్రసారమవుతున్న సంస్క తి, శ్రమదోపిడీ, ఆచారాల పేర స్త్రీని అంగడి సరుకుగా మార్చడం వంటి విషయాలపై గట్టిగా ఈతరం పోరాడాల్సిన అవసరాన్ని చాటుతున్నాయన్నారు. నేటి సమాజంలోని వివిధ రకాల సమస్యలు, దురాచాలను సాహిత్యానికి అనుసంధానం చేసి భావితరాలకు ఆయన చూపారన్నారు. కందుకూరి స జించిన చైతన్యాన్ని బతికించుకుని వికసింపజేసుకోవాల్సిన అవసరాన్ని శర్మ చెప్పారు. చదువు, సమాజాన్ని సంస్కరించుకోవడంలోనూ, ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ సంస్కరణోద్యమంలోనూ ముందడుగు వేసిన కందుకూరి 'గుండెదిటవు'తో నేటితరం పయనించాల్సిన అవసరం ఉందన్నారు. కుళ్లిపోతున్న సంస్క తికి దర్పణం పట్టే అనేక అంశాలపై బహుముఖ కోణాల్లో యుద్ధం చేయడం వలనే భారతదేశ వైతాళికునిగా మనం నేడు కందుకూరిని స్మరించుకుంటున్నామన్నారు. నేటి వర్తమాన పరిస్థితుల్లో కందుకూరి సాహిత్యం అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేదికపై ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రమాదేవి, కందుకూరి శతవర్థంతి కమిటీ కన్వీనర్‌ బి.ప్రభావతి, ఉత్తరాంధ్ర కవులు అట్టాడ అప్పలనాయుడు, డాక్టర్‌ అయ్యగారి సీతారత్నం, ఆచార్య వెలమల సిమ్మన్న, ఎవి.రమణారావు ఉన్నారు. చందు సుబ్బారావు, గంటేడ గౌరినాయుడు, చీకటి దివాకర్‌ తదితరులు ప్రసంగించారు. ప్రజానాట్యమండలి, చిన్నారుల గేయాలు, సాంస్క తిక నాటకాలు సభికులను అలరించాయి. కందుకూరి రచనలను, పుస్తకాలను అతిథులు ఇనాక్‌, ఎంవిఎస్‌.శర్మ ఆవిష్కరించారు.

విశాఖపట్నంలో జూన్‌ 5న జరిగిన కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సమ్మేళనంలో ప్రారంభ  కార్యక్రమంలో  గంటేడ గౌరునాయుడు, అట్టాడ అప్పల్నాయుడు, కొలకలూరి ఇనాక్‌, ఎం.వి.ఎస్‌. శర్మ, వొరప్రసాద్‌, ఎ.వి.రమణారావు