కాకినాడ, విజయనగరం, గుడివాడ, మచిలీపట్నం సభల ఫోటోలు

'నీళ్లింకని నేల' కథా సంకలనం ఆవిష్కరణ

రాయలసీమ అస్తిత్వాన్ని నీళ్ళింకని నేల కథలు బలంగా వ్యక్తీకరించాయని, ఈ కథలు సీమ కన్నీటి సాగరాలని రాయలసీమ ఉద్యమ నేత భూమన్‌ పేర్కొన్నారు. తెలుగు కళా స్రవంతి దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రాయలసీమ ప్రచురణలు వెలువరించిన మొదటి పుస్తకం 'నీళ్ళింకని నేల' కథల సంకలనాన్ని కర్నూలు ఎంపిపి హాలులో మే 29న ప్రముఖ సాహిత్యవేత్త భూమన్‌ ఆవిష్కరించారు. ఈ సభకు ప్రముఖ సముద్ర శాస్త్రవేత్త, తెలుగు కళాస్రవంతి అధ్యక్షులు డాక్టర్‌ ఎంపిఎం.రెడ్డి అధ్యక్షత వహించారు. భూమన్‌ మాట్లాడుతూ వలసలు, కరువు, కష్టాల సేద్యం, వీటితోపాటు ఆత్మీయమైన సంస్క తి, సొగసైన భాష కలిగిన సీమ జీవనచిత్ర ప్రతిబింబంగా ఆవిష్క తమైన ఈ కథలు మన బతుకుల్ని, జీవనచిత్రాన్ని కన్నీళ్లతో లిఖించాయన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఈ కథలకు చేసిన ప్రయత్నం అరుదైనది అనడం కంటే చరిత్రలో నిలిచిపోయేదన్నారు. నీళ్లింకని నేల రాయలసీమ కథల సంపుటి పుస్తకాన్ని ప్రముఖ రచయిత బండినారాయణ స్వామి సమీక్షించారు. రాయలసీమ గొంతుకగా, ఉద్యమ స్వరాలుగా కథలు నిలిచిపోతాయని తెలిపారు. అనంతపురానికి చెందిన ప్రముఖ చిత్రకారులు కుంచెశ్రీ చిత్రించిన రాయలసీమ ప్రచురణల లోగోను రాయలసీమ ఉద్యమనేత బొజ్జా దశరథరామిరెడ్డి ఆవిష్కరించారు. విశిష్ట అతిథిగా హాజరైన కేంద్రసాహిత్య అకాడమి యువపురస్కార గ్రహీత డాక్టర్‌ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి, రాయలసీమ ప్రచురణల గౌరవ సంపాదకులు పి.మారుతి, సంపాదకులు ఇనయతుల్లా, కెంగారమోహన్‌ మాట్లాడారు.   గజల్‌ గాయకులు మహమ్మద్‌ మియా, ఎంపి.బసవరాజుల బ ందం ఆలపించిన రాయలసీమ గీతాలు అలరించాయి.

'అద్వంద్వం' కవితా సంపుటి ఆవిష్కరణ

కాకినాడ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జూన్‌ 11న  గాంధీభవన్‌లో డా: జోశ్యుల క ష్ణబాబు గారి అధ్యక్షతన  పుప్పాల శ్రీరామ్‌ రాసిన ''అద్వంద్వం'' కవితాసంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. పి.ఆర్‌. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చప్పిడి కష్ణ కవితాసంపుటిని ఆవిష్కరించారు.  ప్రధాన వక్తగా విజయనగరంనుండి విచ్చేసిన యువ కవి  పాయల మురళీకష్ణ ప్రసంగించారు.  అనంతరం అనిల్‌ డ్యానీ,  సుంకర గోపాల్‌ ఆత్మీయ ప్రసంగం చేశారు.   గనారా, వుయ్యపు హనుమంతరావు, మార్ని జానకిరామ చౌదరి, పద్మావతి, మురళీకుమారి గ్రంధంపై తమ స్పందన తెలియజేసారు. రచయిత శ్రీరామ్‌ తన స్పందన తెలిపారు.   ఎజ్రాశాస్త్రి వందన సమర్పణతో సభ ముగిసింది.

శ్రీశ్రీ వర్ధంతి సభ

విజయనగరం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జూన్‌ 16న గురజాడ స్వగృహంలో జరిగిన

శ్రీశ్రీ వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న

సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌.

చిత్రంలో డాక్టర్‌ మేడిపల్లి రవికుమార్‌, పాయల మురళీకృష్ణ

'వెలుతురు వాకిట' పుస్తకావిష్కరణ సభ

సమాజాన్ని మార్చేందుకు రాసే సాహిత్యం సజీవంగా ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లి రవి అన్నారు. శ్రీశ్రీ 110 జయంతి సందర్భంగా విజయనగరంలోని గురజాడ కేంద్ర గ్రంథాలయంలో సాహితీస్రవంతి ఆధ్వర్యాన మే 28న జరిగిన 'వెలుతురు వాకిట' పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రవి మాట్లాడుతూ 'వెలుతురు వాకిట' పుస్తక రచయిత రెడ్డి శంకర్రావు శ్రామికుల జీవితం స్పశించేలా కవితలు రాశారని కొనియాడారు. ప్రపంచీకరణ ఆధిపత్య పోకడలను ఎండగడుతూ, దానికి పిండం పెట్టడం ఒక్కటే మనముందున్న కర్తవ్యమని గుర్తు చేశారన్నారు. ప్రస్తుతం స్త్రీని తక్కువ చేసి చూడడం ఎక్కువవుతుందన్నారు. స్త్రీ ఔనత్యం, గొప్పతనం గురించి చెప్పేవారు పెరగాలన్నారు. కవులు ప్రతిధ్వని లాంటివారని కొనియాడారు. సామాజిక వాస్తవాలను గ్రహించే సాహిత్యం రావాలని అన్నారు. విజయనగరం సాహిత్య సభల్లో పాల్గొని ప్రసంగించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. పుస్తకావిష్కర్త అప్పలనాయుడు మాట్లాడుతూ సామాజిక మార్పునకు సాహిత్యం కత్తిలాంటిదని పేర్కొన్నారు. సాహిత్యం, కమ్యూనిజం రెండూ సమాజంలోని దుర్మార్గాలను రూపుమాపేందుకు పుట్టినవని, ఉద్యమకారులు రాసే సాహిత్యానికి బలం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సభాధ్యక్షులు గంటేడ గౌరినాయుడు మాట్లాడుతూ కవి జనంలో కలిసిపోవాల్సి ఉందన్నారు. అటువంటి సాహిత్యం రాణిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ కవి రామసూరి, రచయిత పాయల మురళీక ష్ణ, సిఐటియు జిల్లా నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, కవులు, సాహిత్య వేత్తలు పాల్గొన్నారు.

గుడివాడలో కందుకూరి శతవర్ధంతి సభ

కృష్ణాజిల్లా గుడివాడలోని ఎన్‌టిఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జూన్‌ 8న కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి సభ జరిగింది. సాహితీస్రవంతి గుడివాడ కన్వీనర్‌ లంకా సురేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సభలో  రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగం హార్ధిక కళాశాల తెలుగు హెచ్‌ఒడి డాక్టర్‌ పి.వి.బి సంజీవరావు మాట్లాడుతూ సాహితీ సేవ, సంఘ సంస్కరణకు నడుం బిగించిన వైతాళికుడు కందుకూరి వీరేశలింగమని, సమాజ అభివృద్ధి స్త్రీ విద్యతోనే సాధ్యమని ఆనాడు కందుకూరి తెలిపారన్నారు. తన సాహిత్యం ద్వారా ఆ రోజుల్లోనే ఒంటరిగా మహిళ వివక్షత, బాల్య వివాహాలపై పోరాటం చేశారన్నారు. కొత్త సాహిత్యాన్ని సృషిస్తూ 10వేల పుటలను రచించారన్నారు. తన పత్రికల ద్వారా పరిశోధన జర్నలిజానికి ఆద్యులుగా నిలిచారన్నారు. మరణించి వందేళ్ళు అవుతున్నా వీరేశలింగంను మరువలేని పరిస్థితి నెలకొందన్నారు. సంస్కృత సాహిత్యం, ఆంధ్ర సాహిత్యాన్ని, శాస్త్ర గ్రంధాలను రచించిన వ్యక్తి కందుకూరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో 50 సాహితీ సంస్థలు, మేధావి, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, దళిత సంఘాలు పాల్గొన్నాయి. ప్రముఖ సాహిత్య విమర్శకులు డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ సామాజిక సంస్కరణలకు తన రచనల ద్వారా పోరాడిన వ్యక్తి, ఆద్యుడుగా నిలిచిన వ్యక్తి వీరే శలింగం అన్నారు. కందుకూరి చనిపోయి 100 ఏళ్ళు అవుతున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారన్నారు.   అస్తవ్యస్త పరిస్థితుల్లో సమాజాన్ని సంస్కరించడానికి నడుం బిగించి, కడవరకు పోరాడారన్నారు. ప్రముఖ రచయిత వెన్నా వల్లభరావు మాట్లాడుతూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా కందుకూరి అనేక రచనలు చేశారన్నారు. తెలుగుభాషా వికాస సమితి అధ్యక్షులు డి.ఆర్‌.బి ప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు బాష ఉన్నంతకాలం వీరేశలింగం ప్రజల స్మరణలో ఉంటారన్నారు. శతావధాని డాక్టర్‌ పాలపర్తి శ్యామల ప్రసాద్‌, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షుడు గోళ్ళ నారాయణ రావు, బి.వి. శ్రీనివాస్‌,  డి.ఆర్‌.బి ప్రసాద్‌ తదితరులు ప్రసంగించారు.

సామర్లకోటలో కందుకూరి శత వర్ధంతి సభ

సాహితీ స్రవంతి సామర్లకోట శాఖ ఆధ్వర్యంలో మే 22న బి. క ష్ణా రావు అధ్యక్షతన కందుకూరి శత వర్ధంతి సభ జరిగినది. సాహితీస్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నాగేశ్వరరావు, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోస్యుల కష్ణబాబు కార్యక్రమంలో వక్తలుగా పాల్గొన్నారు. సాహిత్య యుగకర్త సంఘసంస్కర్త నవయుగ వైతాళికుడు కందుకూరి అని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు యువకులు తమ కవిత్వాన్ని చదివి వినిపించారు. ఈ సభలో సాహితీస్రవంతి సామర్లకోట శాఖ కన్వీనర్‌ అంగర గోపాలక్రిష్ణమచార్యులు, కో-కన్వీనర్‌ భైరవ స్వర్ణకుమార్‌ ఎస్‌.జానకి, కెనడీ, ఎస్‌ సత్యం నాయుడు, బేబీ కొండ, సీపీ కష్ణమూర్తి యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

మచిలీపట్నంలో కందుకూరి శతవర్ధంతి సభ

కందుకూరి వీరేశలింగం శత వర్థంతి సందర్భంగా గురజాడ అప్పారావు స్టడీసర్కిల్‌, ఐద్వా, జ్యోతిరావుపూలే విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో యుటిఎఫ్‌ హాల్లో  జూన్‌ 11న సమావేశం జరిగింది. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగుజాతి అభివృద్ధిలో కందుకూరి రచనలు, ఆయన సంస్కరణలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఆ రోజుల్లోనే బాల్య వివాహాలపైనా, వితంతు వివాహాలపైనా, ఆడపిల్లల చదువుల కోసం పోరాడారని గుర్తు చేశారు. అప్పట్లో ఆడపిల్ల గడప దాటకూడదనే నిబంధన ఉండేదని, అటువంటి రోజుల్లో పాఠశాలలు ఏర్పాటుచేసి చదువు చెప్పించే విధంగా ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయనను మించిన సంఘ సంస్కర్త లేరని ఆరోజుల్లోనే పలువురు ప్రశంసించేవారని గుర్తుచేశారు. సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్‌ మాట్లాడుతూ కందుకూరి రచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కందుకూరి మూఢనమ్మకాలపై చేసిన పోరాటాలను ఈ రోజు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కందుకూరి భావాలను అందుకోవడంలో సమాజం ఇంకా వెనకబడే ఉందన్నారు.   జ్యోతిరావుపూలే విజ్ఞానకేంద్రం కన్వీనర్‌ కె.రామ్మోహనరావు, గురజాడ అప్పారావు స్టడీసర్కిల్‌ కన్వీనర్‌ రావి వెంకట్రావు తదితరులు మాట్లాడారు. మచిలీపట్నం ఐద్వా కార్యదర్శి జ్యోతి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

కొత్తపల్లి  నరేంద్రబాబు స్మారక సాహిత్య పురస్కారం-2019

''కవిత్వం బతకాలి - కవి మిగలాలి అనే నినాదంతో కవిసమ్మేళనం సాహిత్య వేదిక''ను స్థాపించి, సాహితీసేవే పరమావధిగా భావించి అనేక సాహితీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ''కొత్తపల్లి నరేంద్ర బాబు'' జ్ఞాపకార్తంగా వారి సేవల్ని కొనసాగించే ప్రయత్నంలో భాగంగా ప్రతియేటా వారిపేరుతో పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు కొత్తపల్లి సురేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2018 సంవత్సరంలో ప్రచురించిన కవిత్వ సంపుటాలను 4 సంపుటాలను కొత్తపల్లి సురేష్‌ ( అక్షరమాలి), 6-1-149-1, జన్మభూమి రోడ్డు, లక్ష్మీనగర్‌, అనంతపురం 515001 చిరునామాకు  పంపించవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు 9493832470, 9908830477 ద్వారా సంప్రదించవచ్చును.