ఎద్దుల సిద్ధారెడ్డి మహాలక్ష్మి సాహిత్య పురస్కార సభ

సాహితీ స్రవంతి, కదిరి అభివద్ధి వేదిక ఆధ్వర్యంలో కదిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో జూన్‌ 1న ఎద్దుల సిద్ధారెడ్డి మహాలక్ష్మి సాహిత్య  పురస్కారాలను కవులు రచయితలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి జిల్లా గౌరవాధ్యక్షులు పిళ్లా విజయ కుమారస్వామి రెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ సాహిత్యం భావ ప్రచారానికి తోడ్పడుతుందని, అదే  సందర్భంలో  సామాజిక మార్పులకు దోహదం చేస్తుందని కూడా అన్నారు. సామాజిక అంశాలపైన కవిత్వం రాయమన్నప్పుడు జిల్లావ్యాప్తంగా సుమారు 70 మంది కవులు కవిత్వాన్ని రాశారన్నారు. మన జిల్లాలో కథా సాహిత్యం కూడా బాగా అభివ ద్ధి చెందుతోందని అందులో మహిళలు బాగా రాస్తారని ఆయన అన్నారు. కదిరి ప్రాంతంలో చాలా మంది సాహిత్యకారులు ఉన్నారని  వారిని ప్రోత్సహించేందుకు సాహితీస్రవంతి ఎల్లప్పుడూ క షి చేస్తోందని ఆయన అన్నారు. ఎద్దుల సిద్ధారెడ్డి  గతంలో  తెలుగు లెక్చరర్గా పనిచేసి కడప లో పదవీ విరమణ అనంతరం ఫిబ్రవరి మాసంలో ఆయన మరణించారు. ఆయన జయంతి సందర్భంగా  ఆయన పేరిట కవిత్వానికి, కథలకు పురస్కారాలను అందజేయడానికి సాహిత్య పోటీలు ఏర్పాటు చేశామన్నారు. ఆ పోటీలో వచ్చిన కవితలను పరిశీలించి పురస్కారానికి ఆవుల వెంకటేశ్వర్లు రాసిన 'ఒక ముగింపు కోసం' కవితను ఎంపికచేశారు. ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా  తెలుగు ఉపన్యాసకులు సుందరమోహన్‌ రెడ్డి వ్యవహరించారు.  ఆయన మాట్లాడుతూ కవులు సాహిత్యాన్ని స జించడానికి ప్రధాన ప్రేరకులు గురువులేనని అన్నారు. కదిరి అభివ ద్ధి వేదిక కన్వీనర్‌ జె.వి. రమణ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి కదిరి వచ్చినవారు సాహిత్యం పట్ల ఎంతో మక్కువ ఉన్న వారని , ఇది సాహిత్యాభివ ద్ధికి తప్పకుండా దోహదం చేస్తుందని ఆయన అన్నారు. సిద్ధారెడ్డి సతీమణి మహాలక్ష్మి మాట్లాడుతూ త్వరలో రాయలసీమ సాహిత్యంపై సదస్సును సిద్ధారెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేయాలని దానికి తన సహకారం అందిస్తానని తెలిపారు. తర్వాత ఎద్దుల సిద్ధారెడ్డి మహాలక్ష్మి కవితా పురస్కారాన్నిఉరవకొండ కు చెందిన ఆవుల వెంకటేశ్వర్ల కు అందజేశారు. ఎద్దుల సిద్ధారెడ్డి కథా పురస్కారాన్ని తాడిపత్రికి చెందిన పోరాల శారదాదేవి కి అందజేశారు. శారదా దేవి ధనమేరా అన్నిటికి మూలం అనే కథను మాండలికంలో అద్భుతంగా రాశారని న్యాయనిర్ణేతలు కవిత, ప్రగతి కొనియాడారు. ఈ సందర్భంగా శారదా దేవి మాట్లాడుతూ ఇదే తనకు లభించిన ప్రధమ పురస్కారమని అన్నారు. తన పిల్లలకు మార్గదర్శకంగా ఉండేందుకు తాను  రాస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, విశ్వనాథరెడ్డి ,మహాలక్ష్మి వసంత కుమార్‌ రెడ్డి ,అవధాని మురళి ,చిన్నారావు, వందన, ఉమామహేశ్వరి ,కష్ణవేణి, గంగరాజు, సమరసింహా రెడ్డి, లాయర్‌ గురులింగస్వామి, స్వాతి, ముస్తఫా ,తదితర కవులు రచయితలు పాల్గొన్నారు.