శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారం 2019 కోసం కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు విమలాశాంతి సాహిత్య సాంఘిక సాంస్క ృతిక సేవాసమితి ఛైర్మన్ శాంతినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 2017 - 18 సంవత్సరాలలో ప్రచురించబడిన కథా సంపుటాలను నాలుగు కాపీలను సెప్టెంబర్ 15 లోపుగా వి. వెంకటేశులు, 3-328, ఎస్‌ఎస్‌ఎస్ సూపర్ మార్కెట్టు దగ్గర, తపోవనం, అనంతపురం చిరునామాకు పంపవలసిందిగా కోరారు. ఎంపికైన కథా సంపుటి రచయితకు డిసెంబర్ నెలలో జరిగే పురస్కార ప్రదానోత్సవ సభలో పదివేల రూపాయల నగదుతో సత్కరించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9916671962 ద్వారా సంప్రదించవచ్చు.