అనంతపురంలో సాహితీ సంగమం

    యువకవులు కవిత్వం రాయడంలో మరింత రాటుదేలాలని ప్రముఖ కవి డాక్టర్‌ రాధేయ అన్నారు. సాహితీ స్రవంతి అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెలనెలా ప్రతీ చివరి శనివారం సాయంత్రం సాహితీ సంగమం కార్యక్రమం లో భాగంగా జూన్‌ 29  ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ వద్ద జరిగిన కవిత్వంతో కరచాలనం కార్యక్రమంలో రాధేయ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో అన్వర్‌, డాక్టర్‌ ఉద్దండం చంద్రశేఖర్‌, మధురశ్రీ, డాక్టర్‌ ఎ.ఎ.నాగేంద్ర, దాదా ఖలందర్‌, కుంచె లక్ష్మి నారాయణ, జి.ఎల్‌.ఎన్‌.ప్రసాద్‌, అప్పల నాయుడు, శిరీష తదితరులు కవిత్వం వినిపించారు. ఈ కార్యక్రమం లో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షురాలు ప్రగతి, ఉపాధ్యక్షులు యాడికి సూర్యనారాయణ రెడ్డి, ప్రజ్ఞా సురేష్‌, ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకులు గురుదేవ్‌, డాక్టర్‌ శ్రీధర్‌ నాయుడు, రంగనాథ్‌, విద్వాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ రాజ్‌ మోహన్‌, సభ్యులు శ్రీనివాసరావు, అధ్యాపకులు రామాంజనేయులు, సంగీత విద్వాంసులు శేషగిరి రాయుడు, విశ్రాంత అధ్యాపకులు ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ కవిత్వం వినిపించిన కొండా శిరీష కు ప్రోత్సాహక బహుమతి అందజేయబడింది.