రాయలసీమ జీవితంపై సాహిత్య సదస్సు

నివేదిక

- విజయ్‌ పిళ్ళా - 9490122229

     సాహితీస్రవంతి ఆధ్వర్యంలో కడపలోని బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో  ఎద్దుల సిద్ధారెడ్డి   స్మారక ఉపన్యాసంలో భాగంగా '21వ శతాబ్దపు రాయలసీమ సాహిత్యంలో  రాయలసీమ జీవితం' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సు ప్రారంభ సమావేశానికి సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు పిల్లా కుమారస్వామి రెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ తూ 21వ శతాబ్దంలో  రాయలసీమ ప్రపంచీకరణ ప్రభావానికి లోను అయిందన్నారు ప్రజా జీవితంలో కరువు తో పాటు అనేక మానవ సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. దానివలన సాహిత్యంలో కూడా అనేక మార్పులు వచ్చాయి అన్నారు. ఈ మార్పుల గురించి సాహిత్యంలోని ప్రక్రియల్లో కవిత్వం కథ నవల నాటికల్లో ఎలా ప్రతిఫలించిందీ ఈ సదస్సులో వక్తలు తెలియజేస్తారు అన్నారు.

ముఖ్యఅతిథిగా హాజరైన వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు ఈశ్వర్‌ రెడ్డి  మాట్లాడుతూ ప్రపంచీకరణ వలన తెలుగు భాష కు ప్రమాదం వాటిల్లుతుందన్నారు. దానివలన సాహిత్యం కు ప్రమాదం వస్తోందన్నారు. సాహిత్యం

అభివ ద్ధి చెందాలంటే సాహిత్యకారులు ఎక్కువ కావాలన్నారు.  సాహిత్య సభలు ఎక్కువగా జరగాలన్నారు. సభలను విద్యార్థుల దగ్గరికి, ప్రజల దగ్గరకు చేరువచేయాలన్నారు. ఆత్మీయ అతిథిగా హాజరైన జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ పాలకులు మారినా రాయలసీమ వెనుకబాటుతనం అభివద్ధి అజెండా రాలేదన్నారు.  ఇప్పటికీ పోలవరం, అమరావతి గురించే మాట్లాడుతున్నారని, అందువలన రాయలసీమ అభివద్ధి చెందాల్సిన విషయం పైన  సాహిత్య కారులు తమ గళం విప్పాలని ఆయన కోరారు. కర్నూల్‌ నుంచి  ఉపన్యాసకులుగా వచ్చిన వెంకట కష్ణ మాట్లాడుతూ రాయలసీమ కవిత్వంలో రాయలసీమ సమస్యల కన్నా ఆ సమస్యలకు కారణాలను, ఆ సమస్యల నివారణకు ప్రజలు చేయాల్సిన కర్తవ్యాలను, ఉద్యమాలను తమ కవిత్వంలో  కవులు ప్రతిబింబింప చేసారని అన్నారు. రాయలసీమ కవిత్వం ప్రపంచీకరణ మూలాలను కూడా పట్టుకుందని అన్నారు

కథా విభాగానికి అధ్యక్షత వహించిన నీలవేణి మాట్లాడుతూ రాయలసీమ కథా సాహిత్యం కరువు ఫ్యాక్షన్‌ లతోపాటు  మానవ సంబంధాల పైన కూడా దష్టి పెట్టిందన్నారు. కుప్పం నుంచి రాయలసీమ కథపై మాట్లాడటానికి వచ్చిన శ్రీదేవి మాట్లాడుతూ రాయలసీమ కథ తమ అస్తిత్వ వేదనను   వ్యక్తీకరించిందన్నారు. 21వ శతాబ్దంలో వచ్చిన కథల్లో ఎక్కువ భాగం మానవ సంబంధాల పైన విలువల పైన, స్త్రీల హక్కుల పైన, బాలల హక్కుల పైన ద ష్టికోణం ఎక్కువగా వచ్చిందన్నారు.

పాలకొల్లు నుంచి ప్రసంగించడానికి వచ్చిన పొదిలి నాగరాజు నవల గురించి మాట్లాడుతూ రాయలసీమ నవలలో గతంలో ఉన్న  ఫ్యాక్షన్‌ తగ్గిపోయినా కరువు మాత్రం ప్రతిఫలించిందన్నారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. వి.ఆర్‌. రాసాని, స్వామి ఇటీవల నవలలు రాశారన్నారు. సన్నపురెడ్డి రాసిన నవలకు తానా వారు అంతర్జాతీయ బహుమతిని కూడా ప్రకటించారన్నారు. ఈయన కరువు గురించి రాస్తే, వి.ఆర్‌. రాసాని కరువుకు మూలాల్ని, బతుకు పోరాటాన్ని చిత్రీకరించారన్నారు. స్వామి బహుజనుల జీవితాలను గురించి రాశారన్నారు. 

నాటకాల విభాగానికి అధ్యక్షత వహించిన షేక్‌ మస్తాన్వలి మాట్లాడుతూ నాటకాలు ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. రాయలసీమ నాటకాల గురించి  మూల మల్లికార్జున్‌ రెడ్డి మాట్లాడుతూ నాటకాలు ప్రజలను రంజింప చేస్తూ ఆలోచింపజేస్తాయన్నారు. రాయలసీమ నాటకాలలో యాక్షన్‌ తో పాటు హాస్యం, ఆవేదన బలంగా ఉందన్నారు. సామాజిక నాటకాలకు ఇంకా ఆదరణ తగ్గలేదని వాటిని ప్రదర్శిస్తే ప్రజలు విరివిగా హాజరవుతున్నారన్నారు. మిగతా ప్రక్రియలకన్నా నాటకాలలో వచ్చిన సాహిత్యం తక్కువగానే ఉందన్నారు అనంతపురం నుంచి శ్రీరాములు కడప నుండి మల్లికార్జున్‌ రెడ్డి ఇలా కొద్ది మంది మాత్రమే రాస్తున్నారు అన్నారు.  ఈ కార్యక్రమంలో కదిరి ప్రాంతపు కవి శంకర్‌ నారాయణ రాజు, శివారెడ్డి, జానుమద్ది ప్రభాకరశాస్త్రి  అనంతపురం నుండి సుధాకర్‌, మల్‌ రెడ్డి, ఎద్దుల మహాలక్ష్మి జనవిజ్ఞాన వేదిక నాయకులు నరసింహా రెడ్డి  గాయత్రి  విద్యార్థినీ విద్యార్థులు తదితరులు  ఈ సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్నారు.