నవమల్లెతీగ మాసపత్రిక నిర్వహణలో పుప్పాల ఫౌండేషన్ కవిత, కథ పురస్కారాలు ఇవ్వనున్నట్లు పుప్పాల ఫౌండేషన్ ఛైర్మన్, రచయిత్రి పుప్పాల సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. కథకు రూ.1500 ల చొప్పున ఐదు కథలకు, కవితకు రూ. 1000 ల చొప్పున ఐదు కవితలకు పురస్కారం ప్రకటించనున్నట్లు తెలిపారు. డిటిపిలో 4 పేజీలు, చేతిరాతలో 6 పేజీలకు మించరాదని, కవితలు 30 లైన్లకు మించకుండా పంపించవలసిందిగా కోరారు. కొత్తదనానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. రచనలను పుప్పాల సూర్యకుమారి, 68-2-6/1బి, అశోక్‌నగర్, కాకినాడ - 533 003 చిరునామాకు అక్టోబర్ 20వ తేదీలోపుగా పంపాలి. ఇతర వివరాలకు 9701973843 ద్వారా సంప్రదించవచ్చును.