అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌ నవలల పోటీ

కొత్తగా నవలలు రాసే రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రచయితలు రాసిన మొదటి నవలకు బహుమతులు అందించనున్నట్లు ట్రస్టు కార్యదర్శి డి. స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. రచయితలు 2015 - 2018 సంవత్సరాల మధ్య కాలంలో రచనను చేసి ఉండాలని, ప్రింట్‌లో 100 పేజీలకు తగ్గకుండా 250 పేజీలకు మించకుండా ఉండాలని కోరారు. పోటీకి అందిన నవలలో రెండు నవలలకు బహుమతి అందివ్వనున్నట్లు తెలిపారు. మొదటి బహుమతిగా పదివేల రూపాయలు, రెండవ బహుమతిగా ఐదువేల రూపాయలు అందజేస్తామన్నారు. డిసెంబర్‌ 24న జరిగే అంపశయ్య నవీన్‌ జన్మదినం రోజు బహుమతులను అందజేస్తారు. అక్టోబర్‌ 31వ తేదీలోపుగా డి.స్వప్న, కార్యదర్శి, నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌, 2-7-7, ఎక్సైజ్‌ కాలనీ, హనుమకొండ, వరంగల్‌ - 506 001 చిరునామాకు పంపించవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు 0870-2456458 ద్వారా సంపద్రించవచ్చును.