డా|| వేదగిరి రాంబాబు బాలసాహిత్య పురస్కారం-2019

డా|| వేదగిరి రాంబాబు బాలసాహిత్య పురస్కారం - 2019  కి గాను బాలసాహిత్యంలో విశేషకృషి చేస్తున్న 'శ్రీవాణి పలుకు' సంపాదకులు ఎమ్‌.వి.వి. సత్యనారాయణ (విశాఖపట్నం) ను ఎంపికచేసినట్లు కన్వీనర్‌ సింహప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వేదగిరి రాంబాబు పుట్టినరోజు అక్టోబర్‌ 14న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఐదువేల రూపాయల నగదు బహుమతితో పురస్కార గ్రహీతను సత్కరిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు.